Vidadala Rajini : పోలీసులు రౌడీలు, గూండాల్లా వ్యవహరిస్తున్నారు
- చట్టం, వ్యవస్థలపై నాకు గౌరవం ఉంది.
- నన్ను లక్ష్యంగా చేసుకొని రెండు రోజుల నుండి పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం.
- నా అనుచరుల మీద, సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.
- పోలీసులు రౌడీలు, గూండాల్లా వ్యవహరిస్తున్నారు : విడదల రజిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini : పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా తనను, తన అనుచరులను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అన్యాయమని, ఇది చట్టవ్యవస్థను అవమానించే పని అని ఆమె మండిపడ్డారు. చట్టానికి, వ్యవస్థలకు తమకు సంపూర్ణ గౌరవం ఉన్నప్పటికీ, పోలీసుల ప్రవర్తన మాత్రం రౌడీలు, గూండాలను తలపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై నమోదవుతున్న కేసుల నేపథ్యాన్ని వివరించిన రజిని, శ్రీ గణేష్ చౌదరి పేరుతో జరుగుతున్న ఫిర్యాదులు పూర్తిగా రాజకీయ నాటకమని అన్నారు. గణేష్ చౌదరి గత ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నాడని, ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినవాళ్లే ముందే పేర్కొన్నారని ఆమె చెప్పారు. ఈ ఏడాది మార్చిలో దర్శిలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా గణేష్ టీడీపీ అనుచరుడని స్పష్టమైన పత్రాలలో ఉందని రజిని వెల్లడించారు. పదేళ్ల క్రితం తీసుకున్నట్లు చెప్పిన 35 లక్షల రూపాయల వ్యవహారాన్ని ఇప్పుడు తనపై తప్పుడు కేసులుగా మలచడానికి ప్రయత్నించడం ఎంతో విచారకరమని ఆమె అన్నారు.
Predator: Badlands : ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ .. ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్!
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
మాబు సుభాని అనే వ్యక్తి పల్నాడు ఎస్పీ కార్యాలయంలో తమపై ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆమె, అతను టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడని, అంతకుముందు చిలకలూరిపేట టౌన్ స్టేషన్‌లో గణేష్‌తో రాజీకి వచ్చిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ అంశాలను పట్టించుకోకుండా, ఒకవైపు ఫిర్యాదు పెట్టేలా, మరోవైపు కేసులు నమోదు చేసేలా పోలీసులు పనిచేస్తున్నారని రాజినిలు విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఒక ఉన్నతాధికారి ఓ ప్రత్యేక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయంటూ ఆమె ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తే వెంటనే కేసులు పెట్టడం, యూనిఫామ్ వేసుకున్న పోలీసులు మూడు పార్టీలకీ అనుకూలంగా పని చేయడం వంటి వ్యవహారాలు చట్టపరమైన విధ్వంసానికే నిదర్శనమని ఆమె అన్నారు.
తన వ్యక్తిత్వ హననానికి డీఎస్పీ నేరుగా పాల్పడ్డారని, దీనిపై పరువు నష్టం దావా వేయడమే కాక హ్యూమన్ రైట్స్ కమిషన్, మహిళా కమిషన్‌లను ఆశ్రయిస్తానని రజిని ప్రకటించారు. “రాజకీయంగా ఒక మహిళ ఎదగడం కొందరికి నచ్చడం లేదు. అందుకే మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. టీడీపీ వాళ్లే ఫిర్యాదు చేసి, వాళ్ల ప్రభుత్వమే కేసులు పెట్టేలా చూస్తోంది” అని ఆమె మండిపడ్డారు. తనపై ఎస్సీ, ఎస్టీతో సహా ఏడు కేసులు నమోదు చేసినా, వాటిని ఎదుర్కొనే ధైర్యం, న్యాయం తనవైపునే ఉందని ఆమె తెలిపారు. ఈ ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరగాలని ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు రజిని వెల్లడించారు.
Seediri Appalaraju House Arrest: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్.. టెన్షన్, టెన్షన్..!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?