Maharashtra: తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..తన పక్కింట్లోనే ఉండే 8 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు దారుణంగా హత్య చేశాడు. పదేపదే తనను ఆటపట్టిస్తుందని, ఏడిపిస్తుందనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెల్హార్ గ్రామంలో డిసెంబర్ 1న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ శివారు నజాఫ్‌గఢ్‌లోని మిత్రోన్ గ్రామ శివార్లలో ఉన్న తన ధాబాలో తన సహజీవన భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో నింపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో కూడా మరో దారుణం జరిగింది.