Atrocity in Maharashtra: అయ్యో బిడ్డా ఆ నొప్పిని ఎలా భరించావురా! 11 మంది 10 గంటలు అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్‌లో మైనర్ బాలికపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ 11 మంది హంతకుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మిగిలిన ఆరుగురి కోసం సత్పతి సీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో పాల్ఘర్‌లో కలకలం రేగింది. నిందితుల్లో ఎక్కువ మంది డ్రగ్స్ మత్తులో ఉన్నారని ప్రచారం జరగుతోంది. పాల్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో టీనేజీ బాలికపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం, శనివారం మధ్య రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పాల్ఘర్ జిల్లా రూరల్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇందులో నిందితులు బాలికను తొలుత సముద్ర తీరానికి తీసుకెళ్లి, ఆ తర్వాత బీచ్ గ్రామంలోని ఖాళీ బంగ్లాలో అత్యాచారం చేశారన్నారు. నిందితులపై సత్పతి పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది.
Read Also: Kolkata: మైనర్ బాలికపై కొడుకు అత్యాచారం.. సహకరించిన తల్లి..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
బాధితురాలు తెలిపిన వివరాలు.. డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు తనపై లైంగిక దాడి చేశారని తెలిపింది. నిందితులు తనను మహీమ్ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాకు తీసుకెళ్లారని, అక్కడ వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. తరువాత, వారు ఆమెను సముద్ర తీరానికి తీసుకెళ్లి, అక్కడ వారు మళ్లీ పొదల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. నిందితుల్లో చాలా మంది యువకులే. వీరంతా గార్డా (మత్తు పదార్ధం)కు బానిసలైన సంగతి కూడా తెలిసిందే. బాధిత మైనర్ బాలిక మాహిమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో సత్పతి సాగరి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కింద కేసు నమోదైంది. ఈ మేరకు పాల్ఘర్ పోలీసు సూపరింటెండెంట్ బాలాసాహెబ్ పాటిల్ వెల్లడించారు. నిందితులంతా మహిమ్, హనుమాన్‌పాడ, టెంబి, సఫాలే, వడ్రాయ్ ప్రాంతాలకు చెందిన వారే. పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనతో పాల్ఘర్‌లో కలకలం రేగింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..