మ్యాచో హీరో గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కొత్త డేట్లను వెతుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘పక్కా కమర్షియల్’ కూడా కొత్త రిలీజ్ డేట్ తో ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మే 20 న…
దివంగత గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు జాలువారాయి. ప్రేక్షకులను ప్రభావితం చేసే పాట రాయాలంటే సీతారామశాస్త్రిని మించిన ఆప్షన్ మరొకటి లేదనేది చిత్రసీమలోని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన, ప్రభావవంతమైన పాటలు అందించారు. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ‘పక్కా కమర్షియల్’లో ఉండటం విశేషం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో…
1947 ఆగస్ట్ 15 మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు! ఆ రోజున దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు వాడవాడలా జండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. చెన్నయ్ లో ప్రముఖ నటుడు చిత్తూరు వి. నాగయ్య తన చిత్ర బృందంతో కలిసి ఆ రోజున జాతీయ జెండాను ఎగరేశారు. అప్పటి నుండి ప్రతి యేడాది చిత్రసీమ సైతం పంద్రాగస్ట్ వేడుకలను జరుపుకుంటూ వస్తోంది. స్వేచ్ఛావాయువులను పీల్చుతూ భారతదేశం ఈ రోజున 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. అందుకే దేశ…