మ్యాచో హీరో గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కొత్త డేట్లను వెతుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘పక్కా కమర్షియల్’ కూడా కొత్త రిలీజ్ డేట్ తో ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మే 20 న మా సినిమా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అది కూడా కరోనా కరుణిస్తేనే అని కూడా చెప్పుకొచ్చారు.
మరోపక్క ‘పక్కా కమర్షియల్’ టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపిన సంగతి తెలిసిందే. దివంగత గీత రచయిత సిరివెన్నెల రాసిన ఈ పాటను తాజగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే’ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ హిట్ ని అందుకుతాడేమో చూడాలి.