సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అంచనాలకు మించి రాణిస్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ బౌలర్లు దెబ్బతీశారు. ఓపెనర్లు ఇస్లాం (14), సైఫ్ హసన్ (14) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం శాంతో (14), కెప్టెన్ మోనిముల్ హక్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో 49 పరుగులకే బంగ్లాదేశ్…
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. బుధవారం రోజు ఐఎస్ఐఎస్ కాశ్మీర్ పేరుతో ఓ బెదిరింపు ఈమెయిల్ రాగా.. గురువారం కూడా ఓ ఈమెయిల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తాజాగా వచ్చిన బెదిరింపులో ‘నిన్ను చంపాలనుకుంటున్నాం… నిన్న బతికిపోయావ్.. బతుకు మీద ఆశ ఉంటే రాజకీయాలను, కాశ్మీర్ అంశాన్ని వదిలేయ్’ అంటూ ఈ మెయిల్‌లో ఉందని గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Read Also: వైద్యం ఖర్చు రూ.వెయ్యి…
రేపిస్టులు భయపడేలా పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తోంది. రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేరచట్టం-2021 బిల్లుకు బుధవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తక్షణ చర్యల కోసం ఈ బిల్లును రూపొందించింది. గత ఏడాదే ఈ బిల్లుకు పాకిస్థాన్…
టీ20 ప్రపంచకప్ ముగియడంతో ఈ టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ఆటగాళ్లతో కూడిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ టీమ్‌లో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. మొత్తం ఆరు జట్ల ఆటగాళ్లను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. ఈ జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సారథిగా ఐసీసీ పేర్కొంది. ఐసీసీ ప్రకటించిన టీమ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లు, శ్రీలంక…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ రేసులో లేకపోవడానికి కారణం పాకిస్థాన్‌పై ఓటమి. ఈ ఓటమి మన ఆటగాళ్ల మానసిక బలాన్ని దెబ్బతీసింది. దీంతో టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పాకిస్థాన్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత అభిమానులు ఆసీస్‌కు మద్దతు పలికారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవాలని కోరుకున్నారు. చివరకు పాకిస్థాన్ ఓడిపోవడంతో భారత అభిమానులు ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. Read Also: విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తి అరెస్ట్ ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు…
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సానియా మీర్జా టెన్నిస్‌లో భారత్ తరఫునే ఆడుతోంది. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సానియా మీర్జా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో స్టేడియంలో సానియా…
టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లు ముగిశాయి. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో ఈనెల 14న జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించడం షురూ అయ్యింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మట్టికరిపించింది. తొలుత…
షెడ్యూలింగ్ కారణాలను” పేర్కొంటూ, యుద్ధంతో దెబ్బతిన్న ఆప్ఘాన్ దేశ పరిస్థితులపై భారతదేశం నిర్వహించిన ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేష న్‌నుకు చైనా గైర్హాజరైంది. దాని మిత్ర దేశమైన పాకిస్తాన్ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైయింది.దీంతో డ్రాగన్ ఆడుతున్న డ్రామాలు మరోసారి బయట పడ్డాయి. ఈ విషయం పై ఇప్పటికే భారత్ చైనాను వివరణ కోరింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చర్చించడానికి ఇస్లామా బాద్‌లో అమెరికా, చైనా,రష్యాలకు చెందిన సీనియర్ దౌత్య వేత్తలకు పాకిస్తాన్ గురువారం ఆతిథ్యం…
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్ ధోవల్ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను…
భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే ప్రతి క్రికెట్ అభిమాని టీవీకి అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత దాయాది జట్లు సమరానికి దిగాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 70 లక్షల మంది వీక్షించారట. ఈ విషయాన్ని స్వయంగా ఈ మ్యాచ్ ప్రసారం చేసిన స్టార్ నెట్‌వర్క్ తెలియజేసింది. Read Also: కెప్టెన్‌గా రోహిత్…