కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…