బ్రిటన్, పాకిస్థాన్‌ల ద్వంద్వ పౌరసత్వం కలిగిన రాడికల్ ఇస్లామిక్ బోధకుడు అంజెమ్ చౌదరికి జీవిత ఖైదు విధించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థను నడిపినందుకు మంగళవారం దోషిగా తేలింది. దీంతో.. అంతర్జాతీయ స్థాయిలో సంయుక్త విచారణ అనంతరం చౌదరికి యూకే(UK)లో జీవిత ఖైదు విధించారు. చౌదరి వయస్సు 57 సంవత్సరాలు. ఉగ్రవాద సంస్థ (ALM) అల్-ముహాజిరౌన్‌లో కేర్‌టేకర్ పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.
ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి ఉంటున్న పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కన్ను, పెదవి దగ్గర గాయాలయ్యాయి.
సోషల్ మీడియా వచ్చాక కులాంతర వివాహాలే కాదు దేశాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే అది తప్పేమి కాదు. కానీ పెళ్ళై భర్త పిల్లలు ఉన్న మహిళలు, భార్య పిల్లలు ఉన్న పురుషులు కూడా సోషల్ మీడియా వేదికగా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ఆపైన నమ్ముకున్న వాళ్ళని వదిలి దేశాలు ధాటి సోషల్ మీడియా ప్రేమని చేరడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ కోవలోకే వస్తుంది పాకిస్తాన్ కి చెందిన సీమా హైదర్. ఆరు నెలల…
విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది.
Honey Trap: భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హనీట్రాప్ ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ లో పంచుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది.