Pakisthan: ఉగ్రవాద సంస్థను నడిపినట్లు దోషిగా తేలిన అంజెమ్ చౌదరికి జీవిత ఖైదు..
- బ్రిటన్-పాకిస్థాన్‌ల ద్వంద్వ పౌరసత్వం కలిగిన రాడికల్ ఇస్లామిక్ బోధకుడు..
- అంజెమ్ చౌదరికి జీవిత ఖైదు విధింపు
- నిషేధిత ఉగ్రవాద సంస్థను నడిపినందుకు దోషిగా తేల్చిన న్యాయస్థానం
- చౌదరికి యూకే(UK)లో జీవిత ఖైదు విధింపు
- ఉగ్రవాద సంస్థ (ALM) అల్-ముహాజిరౌన్‌లో కేర్‌టేకర్ పాత్ర పోషిస్తున్నట్లు గుర్తింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్, పాకిస్థాన్‌ల ద్వంద్వ పౌరసత్వం కలిగిన రాడికల్ ఇస్లామిక్ బోధకుడు అంజెమ్ చౌదరికి జీవిత ఖైదు విధించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థను నడిపినందుకు మంగళవారం దోషిగా తేలింది. దీంతో.. అంతర్జాతీయ స్థాయిలో సంయుక్త విచారణ అనంతరం చౌదరికి యూకే(UK)లో జీవిత ఖైదు విధించారు. చౌదరి వయస్సు 57 సంవత్సరాలు. ఉగ్రవాద సంస్థ (ALM) అల్-ముహాజిరౌన్‌లో కేర్‌టేకర్ పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. లండన్‌లోని వూల్‌విచ్ క్రౌన్ కోర్టులో విచారణ సందర్భంగా.. 2014 నుండి నిర్దిష్ట కాలానికి మద్దతుగా ఒక తీవ్రవాద సమూహాన్ని నడుపుతున్నట్లు.. ఆన్‌లైన్ సమావేశాలను నిర్వహించినట్లు చౌదరి నేరాన్ని అంగీకరించాడు.
Bahishkarana: అతనితో పని చేయడం కిక్కిస్తుంది.. అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
అంతకుముందు.. మెట్రోపాలిటన్ పోలీస్, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్.. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అంజెమ్ చౌదరిని విచారించారు. అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టగా, జూలై 30న తన తీర్పును వెలువరించింది. ఈ కేసులో చౌదరికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఏఎల్‌ఎం నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని మెట్రోపాలిటన్ పోలీస్ యాంటీ టెర్రరిజం విభాగం అధిపతి కమాండర్ డొమినిక్ మర్ఫీ తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల భద్రత.. భద్రతపై ప్రభావం చూపుతోందన్నారు. 2006లో అల్ ఘురాబా పేరుతో ఏఎల్‌ఎం మొదటిసారిగా యూకేలో నిషేధించబడినట్లు నివేదించారు. అందులో కీలకమైన ముగ్గురు సభ్యులలో చౌదరి ఒకరు.
Puja khedkar: పూజా తల్లిదండ్రుల వైవాహిక వివరాల్ని అడిగిన కేంద్రం
చౌదరి 2023 వరకు ఏఎల్‌ఎం నాయకుడిగా పనిచేశాడు. ఇస్లామిక్ థింకర్స్ సొసైటీకి ఆన్‌లైన్ ప్రసంగాలు చేయడం ద్వారా ఏఎల్‌ఎంకి మద్దతు ఇచ్చారని దర్యాప్తు సంస్థ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తెలిపింది. 2018లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా నిలిచినందుకు చౌదరికి ఐదేళ్ల శిక్ష పడింది. కానీ అతను ముందుగానే విడుదలయ్యాడు.. 2021 వరకు అతనికి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ నిషేధం ముగిసిన వెంటనే.. చౌదరి మళ్లీ ఇల్ఫోర్డ్‌లోని తన ఇంటి నుండి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఇస్లామిక్ సంస్థకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాడు. గతేడాది జూలైలో చౌదరి సహచరుడు ఖలీద్ హుస్సేన్ (29)ను లండన్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అతను ఏఎల్‌ఎం సభ్యునిగా దోషిగా తేలింది. 2022 జూన్ నుండి అరెస్టు అయ్యే వరకు.. చౌదరి బ్రిటన్‌లో ఇస్లామిక్ స్టేట్ స్థాపనపై చిన్న చిన్న సమూహాలలో ఆన్‌లైన్ ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా నొక్కిచెప్పారని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!