2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నిర్ణయించేందుకు వర్చువల్ సమావేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటుకు ఒక రోజు ముందు ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
పాకిస్తాన్ లో శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు ఆ దేశ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 16వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Prasannajit Rangari: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కి చెందిన సంఘమిత్ర ఖోబ్రగాడే తన సోదరుడు ప్రసన్న జిత్ రంగరిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించేందుకు పోరాడుతోంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రసన్నజిత్ ఏడేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతడి కోసం కుటుంబీకులు తీవ్రంగా గాలించినప్పటికీ ఆచూకీ కనుగొనలేకపోయారు. చివరకు అతను మరణించినట్లు భావించారు.
Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మరోసారి లాక్డౌన్ విధించారు. ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల సమయంలో, ప్రధాన దేశాల నేతలు రావడంతో ఇస్లామాబాద్-రావల్పిండిలో లాక్డౌన్ విధించింది. తాజాగా మరోసారి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోసం అతని మద్దతుదారులు తీవ్ర నిరసనలకు సిద్ధమయ్యారు.
Pakistan: పాకిస్తాన్లోకి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేశాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వ్యాప్తంగా చైనా జాతీయులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టులలో పనిచేస్తున్న తన జాతీయుల భద్రతను నిర్ధారించడానికి చైనా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది.
Terrorist Attack: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రదాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో 50 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డౌన్ కుర్రం ప్రాంతంలో ప్రయాణీకుల వ్యాన్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి, మహిళలు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అందిన నివేదిక ప్రకారం.. ఈ దాడిలో 50 మంది మరణించారు. దిగువ కుర్రంలోని ఓచుట్ కలి, మండూరి సమీపంలో ప్యాసింజర్ వ్యాన్ వెళ్లగానే…
పాకిస్థాన్‌లోని గుజ్రాన్వాలాలో ఒక బిచ్చగాడు తన అమ్మమ్మ జ్ఞాపకార్థం గొప్ప విందు ఏర్పాటు చేసి ప్రజలను ఆశ్చర్యపరిచిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అపూర్వ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పదేళ్ల హిందూ బాలికను కిడ్నాప్ చేసి ముస్లిం వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసిన ఉదంతం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. అయితే అధికారులు ఆమెను కాపాడారు. గత వారం మిర్పూర్ ఖాస్‌లోని కోట్ గులామ్ ముహమ్మద్ గ్రామంలోని ఇంటి బయటికి వెళ్లిన 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. సిర్హండి ఎయిర్ సమరో మదర్సాకు తీసుకెళ్లారు. బాలికను బలవంతంగా ఇస్లాం మతం స్వీకరించేలా చేశారు. అనంతరం షాహిద్ తల్పూర్‌తో వివాహం జరిపించారు. అయితే.. హిందూ మైనారిటీలో…
Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చి వేశాడు. కారును పేల్చిన తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగినట్లు అక్కడి మీడియా తెలిపింది.