Pakistan: పాకిస్తాన్ అత్యంత కష్టకాలంలో ఉంది. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రాజకీయ అస్థిరత. దీనికి తోడు బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాలిబన్ల ఎటాక్స్ ఇలా అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పైకి చెప్పలేకపోతోంది, కానీ పాకిస్తాన్ కొన్ని రోజుల్లో ముక్కలు అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, మరోవైపు పాకిస్తాన్‌ని మిత్రదేశాలు కూడా పట్టించుకోవడం లేదు. చైనా, టర్కీ వంటి దేశాలు కూడా పాక్ విషయంలో పెద్దగా స్పందించడం లేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా పాకిస్తాన్‌కి భారీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు పాకిస్తాన్‌కి అమెరికా ‘‘నాటోయేతర మిత్రదేశం’’ హోదాను కల్పించింది. అయితే, దీనిని రద్దు చేయాలని రిపబ్లిక్ కాంగ్రెస్ సభ్యుడు అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టాడు.
Read Also: Samsung Galaxy A15 5G: త్వరపడండి.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌పై భారీ డిస్కౌంట్..
క్రైమ్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్ నిఘాపై హౌస్ జ్యుడీషియరీ కమిటీ సబ్‌కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ సభ్యుడు ఆండీ బిగ్స్ ఈ బిల్లును తీసుకువచ్చారు. హక్కానీ నెట్వర్క్ స్వేచ్ఛా కదలికల్ని నిలువరించేలా పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలను కొనసాగించకపోతే, అధ్యక్షుడు ఈ విషయంలో ధ్రువీకరణ పత్రం జారీ చేయకూడదని చెప్పారు.
హక్కానీ నెట్‌వర్క్ పాకిస్తాన్‌ను సురక్షిత స్వర్గధామంగా ఉపయోగించుకోకుండా నిరోధించడానికి పాకిస్తాన్ తన నిబద్ధతను ప్రదర్శించడానికి చర్యలు తీసుకోవాలని, హక్కానీ నెట్‌వర్క్ వంటి ఉగ్రవాదుల కదలికలను పాక్-ఆఫ్ఘన్ బోర్డర్‌లో నియంత్రించడానికి ఇస్లామాబాద్ ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చురుకుగా సమన్వయం చేసుకోవాలని కోరాడు. ఈ బిల్లును మొదట జనవరి 2019లో బిగ్స్ US ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు, పలు సందర్భాల్లో ప్రతీ కాంగ్రెస్‌లో కూడా ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పటి వరకు బిల్లుపై ఎలాంటి పురోగతి రాలేదు.