Dulhasti Stage 2 Project: పాకిస్థాన్‌కి గడ్డు కాలం మొదలు కానుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక కమిటీ జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చెనాబ్ నదిపై 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–2 జలవిద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌తో ఉన్న ఇండస్ జల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ) ప్రస్తుతం నిలిపివేసిన విషయం తెలిసిందే.
Taliban: పాకిస్తాన్‌కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్‌కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం. ఇప్పుడు, భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నడుస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి పాక్‌లోకి వెళ్లే నదుల నీటిని సరిహద్దు దాటనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Afghanistan: భారతదేశం బాటలో ఆఫ్ఘనిస్థాన్ నడుస్తుంది. తాజాగా తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్‌లో నీటి కటకట ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఇండియా అనుసరించింది ఏంటో తెలుసా.. భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశానికి నీటి సరఫరాను రద్దు చేసింది. ఇప్పుడు ఇదే బాటలో తాలిబన్ ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేస్తుంది. తాలిబాన్ డిప్యూటీ సమాచార మంత్రి ముజాహిద్ ఫరాహి ఇటీవల మాట్లాడుతూ.. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని తాలిబాన్ సుప్రీం…
Diamer Bhasha Dam: పాకిస్థాన్ తన దేశంలో ఉన్న అపారమైన నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే నీటికి కటకటలాడే పరిస్థితులు తలెత్తవు. ఈ నీటి వనరులను సరిగ్గా ఉపయోగించుకుంటే చౌకైన విద్యుత్ ఉత్పత్తి, బంజరు భూములను సాగు భూములుగా మార్చడం జరిగేవి. సరైన నీటి వనరులు ఉన్నప్పటి కూడా వాటి నిర్వహణలో పాకిస్థాన్ నిర్లక్ష్య విధానం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తాజాగా పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సింధు నదిపై నిర్మించనున్న డైమర్-భాషా ఆనకట్ట దేశంలో నీటి…
Amit Shah : సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా భారత నీటిని వాడుక చేసిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతకు ఎదురుకావాల్సిందేనని హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను తులతూలకుండా రద్దు చేయలేమని, కానీ సింధూ ఒప్పందాన్ని…