Afghanistan: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన అశాంతి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘనిస్థాన్ పాక్ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. తాజాగా రెండు దేశాలు ఇప్పటికీ దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు లష్కరే తోయిబా శిబిరంలో పెరిగిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు.
Bangladesh: షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆడింది ఆటగా సాగుతోంది. బంగ్లాదేశ్ తీవ్ర భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది. భారత శత్రువులకు ‘‘రెడ్ కార్పెట్’’ ఆహ్వానం పలుకుతోంది. తాజాగా, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ (LeT) హఫీజ్ సయీద్ సన్నిహితులు బంగ్లాదేశ్‌కు వెళ్లాడు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ మర్కజీ జమియత్ అహ్ల్-ఎ-హదీత్ ప్రధాన కార్యదర్శి ఇబ్తిసం ఎలాహి జహీర్…
భారత్‌లో పుట్టి దేశ ద్రోహానికి పాల్పడ్డ పాక్ గూఢచారుల భరతాన్ని అధికారులు చెండాడుతున్నారు. యూట్యూబర్ల ముసుగులో భారత రక్షణ సమచారాన్ని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కు చేరవేసిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాతో పాటు పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది తమ పనేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ – TRF ప్రకటించింది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ISI హస్తం ఉందనే సమాచారం అందుతోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని “స్థానిక తిరుగుబాటు”గా అభివర్ణించింది. బైసరన్ మేడోస్.. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు.…
Punjab: పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) విదేశాల నుండి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఒక మైనర్‌తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
Punjab: శుక్రవారం అర్థరాత్రి పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ దేవాలయంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కిటికీ అద్ధాలు, గోడలు దెబ్బతిన్నాయి. ఖాండ్‌వాలా ప్రాంతంలోని ఠాకూర్ ద్వార ఆలయం వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌ప వచ్చి, ఆలయంపై పేలుడు పదార్థాలు విసిరి పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి.
Seema Haider: ప్రస్తుతం దేశ వ్యా్ప్తంగా మారుమోగుతున్న పేరు సీమా హైదర్... ఈ పాకిస్థానీ మహిళ సచిన్ అనే యువకుడిని పబ్జీ గేమ్ ఆడుతూ ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో భారత్ కు అతడి కోసం వచ్చేసింది.