Honour killing: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సుకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబాన్ని కాదని పెళ్లి చేసుకున్న ఒక యువ జంటను హత్య చేస్తున్న భయంకరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక గుంపు కారులో రాష్ట్ర రాజధాని క్వెట్టా నుంచి వీరిద్దరిని నిర్జన ప్రాంతంలోకి తీసుకువచ్చినట్లు చూపిస్తోంది. అక్కడే సదరు యువతితో పాటు యువకుడిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఆ మహిళకు శాలువాతో కప్పిన ఖురాన్‌ని అందిస్తున్నట్లు వీడియో ఉంది. జన…
Honour killing: ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పడిన పాకిస్తాన్‌లో కొందరు మతఛాందసవాదాన్ని తలకెక్కించుకుంటున్నారు. దీంతో అక్కడ అమ్మాయిలు, మహిళల స్వేచ్ఛకు పరిమితులు ఉంటున్నాయి. ఇదే కాకుండా పరువు హత్యల విషయంలో పాకిస్తాన్ టాప్ పొజిషన్‌లో ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న, ప్రేమించుకుంటున్న అక్కడ అమ్మాయిలను సొంత బంధువులు, కుటుంబ సభ్యులే క్రూరంగా హత్య చేస్తున్నారు.
Honour Killing: ‘పరువు’ పేరుతో పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. మానవహక్కుల నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 1000 మంది మహిళలు దారుణంగా హత్యలకు గురవుతున్నారు. మరోసారి మరో పరువు హత్య పాకిస్తాన్‌లో చర్చనీయాంశం అయింది. జంటకు హాని కలిగించొద్దని న్యాయమూర్తి హెచ్చరించినప్పటికీ అమ్మాయి కుటుంబీకులు అబ్బాయిని, అమ్మాయిని చంపేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఈ హత్యలకు కారణమైంది.