Pak Drone Attack: పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాక్ పౌర విమానాలను రక్షణగా ఉంచుకుని భారత్‌పై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. వరసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ భారత నగరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు (IB),నియంత్రణ రేఖ (LOC)లను దాటి దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలనున భారత సైన్యం భగ్నం చేసింది.
Pak drone attacks: వరసగా రెండో రోజు దాయాది పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి, సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా 26 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.