ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నిన్నటిదాకా భారత్ నాలుగో స్థానంలో ఉండేది. కానీ.. పాకిస్తాన్ ఇప్పుడు భారత్ను వెనక్కు నెట్టేసి, ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా పాక్ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో, మొత్తంగా 106 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో పాక్ నాలుగో స్థానానికి ఎగబాకింది. టీమిండియా 105 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యింది. తొలి…