పహల్గామ్‌లో హిందువుల ఊచకోతకు పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీఓకే వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 రహస్య స్థావరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్థాన్‌పై జరిగిన ఈ దాడికి భారత సైన్యం "ఆపరేషన్ సిందూర్" అని పేరు పెట్టింది. ఈ దాడి తర్వాత.. మొత్తం పాకిస్థాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.
పహల్గామ్ ఉగ్ర దాడిని అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణహోమంతో అమెరికా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పోల్చారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని.. అలాగే పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం, 27 మంది వరకు టూరిస్టులు ఈ దాడిలో మరణించినట్లు సమాచారం.
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది.
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అసిమ్ మునీర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్ తమ జీవనాడి అని.. దానిని మరిచిపోలేమని వ్యాఖ్యానించారు.
Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా ఎప్పుడైతే పదవీ కొల్పోయిందో అప్పటి నుంచి నెమ్మదిగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ పాకిస్తాన్‌తో బంగ్లా రిలేషన్స్‌ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం,