Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
Asim Munir: ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ..? అనే ప్రశ్న అందరితో మెదులుతోంది. మీడియాలో వస్తు్న్న వార్తల ప్రకారం, ఆసిమ్ మునీర్‌ని ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ఉద్రిక్తతకు కారణం మాత్రం ఆసిమ్ మునీరే. ఆయన చేసిన విద్వేష ప్రసంగం తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. హిందూ-ముస్లింలు వేరని హిందువుల పట్ల, భారత్ పట్ల ద్వేషాన్ని…
Operation Sindoor: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి భారత్ దిమ్మతిరిగే రీతిలో జవాబు ఇచ్చింది. గత నెలలో పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మతం ఆధారంగా హిందువులను టార్గెట్ చేస్తూ కాల్చి చంపారు. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదం, దానికి మద్దతు ఇస్తున్న పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు బలంగా కోరుకున్నారు.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. బెలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్సుల్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు భయపడి చస్తున్నారు.