జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్‌కి చెందిన అనేక సైనిక, ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మే 6-7 రాత్రి నుంచి మే 10 వరకు భారత వైమానిక దళం (IAF) జరిపిన దాడుల్లో పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 6 పీఏఎఫ్ యుద్ధ విమానాలు, 2 AWACS, 1 C-130 విమానం, 30 క్షిపణులు, అనేక డ్రోన్లు (UCAV)లు…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. గురువారం రాత్రి పాకిస్థాన్ జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా అనేక నగరాలపై క్షిపణులతో దాడి చేసింది. అయితే.. భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ S-400 క్షిపణులను గాల్లోనే కూల్చివేసి దాడిని అడ్డుకుంది. అలాగే.. పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను భారత్ కూల్చివేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, షాపూర్, మాధోపూర్, ఫిరోజ్‌పూర్, జైసల్మేర్‌లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది.