ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లుగా ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్‌లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు.