పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ ప్రతీకార ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘర్షణ సైనిక చర్యలే కాకుండా వాటర్ వార్, దౌత్యదాడికి దిగుతోంది భారత్. పాక్ పై మళ్లీ వాటర్ వార్ కు దిగింది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ ఆనకట్ట 5 గేట్లను తెరిచారు. దీంతో పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది.
Also Read:Operation Sindoor Film First Poster Out: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల
భారత్, పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత్ కఠినమైన వైఖరిని అవలంబించింది. ‘ఆపరేషన్ సింధూర్’ కింద పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులను ప్రారంభించింది. ఈ ప్రతీకార చర్య తర్వాత, పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read:Char Dham Yatra: భారత్- పాక్ మధ్య యుద్ధం.. ఛార్ధామ్ యాత్ర నిలిపివేత!
అంతకుముందు పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహాన్ని ఆపడానికి భారత్ సలాల్, బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసివేసింది. దీని కారణంగా పాకిస్తాన్‌లోని చీనాబ్ నీటి మట్టం 2-3 అడుగులకు తగ్గింది. ఇప్పుడు భారీ వర్షాలు, నీటి మట్టం పెరగడంతో, ఆనకట్ట గేట్లు ఓపెన్ చేశారు. దీంతో పాక్ లోని నదీప్రవాహ ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. పాక్ కు దెబ్బమీద దెబ్బ తగులుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది.
Also Read:Omar Abdulla : శాంతిని కోరుకుంటున్నారా..? అయితే IMF సాయం ఆపండి.. ఒమర్ ఆగ్రహం..
సింధు జల ఒప్పందం విషయంలో కూడా భారతదేశం ఇప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకోవచ్చని పాకిస్తాన్‌కు స్పష్టమైన సంకేతం ఇస్తోందని నిపుణులు భావిస్తున్నారు. 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీనిలో భారతదేశం సట్లెజ్, రావి, బియాస్ నదులపై హక్కులను పొందింది, సింధు, జీలం, చీనాబ్ నదులపై హక్కులు పాకిస్తాన్‌కు వచ్చాయి. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో జరిగింది. కానీ, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారత్ ఈ ఒప్పందాన్ని సమీక్షించే దిశగా అడుగులు వేస్తోంది.