వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయిందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఇరుల కమ్యూనిటీకి చెందిన పాములను పట్టడంలో నిపుణులైన వడివేల్ గోపాల్, మాసి సదయన్ ఉన్నారు.
ఒకప్పుడు నాజూకు షోకులతో ప్రేక్షకులను పరవశింప చేసిన నటి రవీనా టాండన్ కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రవీనా టాండన్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల బాలీవుడ్ లో ఆనందం వెల్లివిరిసింది. రవీనా టాండన్ ఉత్తరాదిన అజయ్ దేవగన్ తో కలసి అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ఖిలాడీ కుమార్ గా పేరొందిన అక్షయ్ కుమార్ కు జోడీగానూ భలేగా అలరించారు. ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ వంటి హీరోలతోనూ భలేగా మురిపించారు. తెలుగు…
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక – పార్ట్ IIలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2022కి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. సంగీత, వినోద ప్రపంచంలోని ప్రముఖులు పద్మ విభూషణ్ ను అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును మార్చి 28న అందుకున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు విక్టర్ బెనర్జీకి పద్మభూషణ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని…
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం నాడు పద్మ పురస్కారాల ప్రదానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పద్మ అవార్డుల విజేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచన కర్త, ఏపీకి చెందిన గరికపాటి నరసింహారావు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న వారి జాబితాలో మొగులయ్య కూడా ఉన్నారు. మరోవైపు భారత…
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు కోటి రూపాయల రివార్డును సీఎం కేసీఆర్ ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో మంగళవారం నాడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను సకిని రామచంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. Read Also: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి: సీఎం కేసీఆర్ ఈ…
ప్రముఖ తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన ఎన్టీవీతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను ఎన్టీవీతో పంచుకున్నారు.నాకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని గరికపాటి అన్నారు. నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలన్నారు. పద్మశ్రీ అవార్డు కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావు అన్నారు. Read Also: కొత్త…
ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. పద్మ అవార్డుల తుది జాబితాకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో.. ఆ జాబితాను ఇవాళ కేంద్ర హోంశాఖ విడుదల చేసింది.. నలుగురికి పద్మవిభూషన్, 17 మందికి పద్మభూషన్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి.. అందులో మొగిలయ్య ఒకరు.. ఆయనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు…
తొమ్మిది పదుల వయసులో నేటికీ తొణక్క బెణక్క హుషారుగా సాగుతున్న మేటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో తొలి పద్మ అవార్డు చోటు చేసుకుంది. 72 సంవత్సరాల నటనాజీవితం గడిపిన షావుకారు జానకి వంటి మేటి నటికి ఇన్నాళ్ళకు, ఇన్నేళ్లకు పద్మశ్రీ పురస్కారం లభించడం ఆమె అభిమానులకు ఆనందం పంచుతోంది. అయితే, చాలా ఆలస్యంగా జానకికి ఈ అవార్డు లభించిందని కొందరు ఆవేదన చెందుతున్నారు. జానకి మాత్రం ఎప్పుడు వచ్చింది అన్నది ముఖ్యం కాదు, ప్రభుత్వం…