ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలలో దేశవ్యాస్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో కె.జి.ఎఫ్2 ఒకటి. కెజిఎఫ్ పార్ట్ వన్ సాధించిన విజయం సీక్వెల్ పై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ హీరోగా సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. నిజానికి ఈ సినిమా జూలై…
ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణమూర్తి తప్పు పట్టారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేవలం ఇరవై ఐదు శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, కొన్ని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మిగిలిన 75 శాతం మంది ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఇటీవల సురేశ్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని, దానిని కూడా కొద్ది మంది మాత్రమే…
బిగ్ బాస్ షోతో సల్మాన్ అనుబంధం చాలా ఏళ్లుగా నుంచీ కొనసాగుతోంది. అయితే, రానున్న బిగ్ బాస్ సీజన్ లో సల్మాన్ కి బదులు మరోకరు హోస్ట్ గా రాబోతున్నారా? ‘వూట్’ ఓటీటీ నుంచీ వస్తోన్న సమాచారం చూస్తే అలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు తమ రియాల్టీ షోని మరింత సుదీర్ఘంగా నడిపేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారట. అందులో భాగంగా ‘బిగ్ బాస్ ఓటీటీ’ షోని మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్త ఫార్మాట్ లో మొదట…
సౌత్ ఇండస్ట్రీస్ లో కంటే బాలీవుడ్ లో ఓటీటీల జోరు బాగానే ఉంది. సినిమాలు, సిరీస్ లు, రకరకాల షోస్ తో బీ-టౌన్ బిగ్గీస్ వరుసగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి క్యూ కడుతున్నారు. లెటెస్ట్ ఇన్ ద లైన్… మరెవరో కాదు… మన ‘తలైవి’ కంగనా రనౌత్! త్వరలో వెండితెర మీద జయలలితగా అలరించబోతోన్న ముంబై ‘తలైవి’ కంగనా ఒక రియాల్టీ షో హోస్ట్ చేయబోతోందట. ఆల్రెడి అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ కూడా చేసిందట.…
‘అక్టోబర్ నెలాఖరు వరకూ ఏ నిర్మాత తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసింది. అయితే… దానికంటే ముందే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన బ్యానర్ లో ఇతరులతో కలిసి నిర్మిస్తున్న ‘నారప్ప, దృశ్యం -2, విరాట పర్వం’ చిత్రాలను ఓటీటీ రిలీజ్ కు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ఛాంబర్ సర్వ సభ్య సమావేశంలోనూ సభ్యులు సురేశ్ బాబును టార్గెట్ చేస్తూ…
‘అక్టోబర్ వరకూ ఓటీటీల్లో మీ సినిమాలను విడుదల చేయకండి. ఆ తర్వాత కూడా పరిస్థితులలో మార్పు రాకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి’ అని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం తాజాగా చేసిన తీర్మానం చిత్రసీమలో ఓ కొత్త చర్చకు తెరలేపింది. కరోనా కారణంగా సినీరంగం దెబ్బతిన్న మాట వాస్తవం. సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో నిర్మాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, థియేటర్ల మూసివేత కారణంగా ఎగ్జిబిటర్స్ సైతం అంతే ఇబ్బంది పడ్డారు. సెకండ్…
ఈషా డియోల్ తిరిగి వచ్చేస్తోంది. అయితే, హేమా మాలిని వారసురాలు పెద్ద తెర మీదకి రావటం లేదు. డిజిటల్ డెబ్యూతో స్మార్ట్ స్క్రీన్స్ పై సందడి చేయనుంది. ఈషా డియోల్ తక్తానీ పెళ్లి తరువాత పూర్తిగా కెమెరాకు దూరమైంది. అయితే, ఇప్పుడు తనని మిస్ అవుతోన్న ఫ్యాన్స్ కి మిసెస్ ఈషా డియోల్ ‘రుద్రా : ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’తో ఎంటర్టైన్మెంట్ పంచనుంది. బ్రిటన్ లో సూపర్ సక్సెస్ అయిన బీబీసీ వారి వెబ్…
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం…
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ…
తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని…