బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ నెట్ ఫ్లిక్స్ బాట పట్టబోతున్నాడు. స్ట్రీమింగ్ జెయింట్ తలపెట్టిన ఓ నాన్ ఫిక్షన్ షోలో బ్రిటీష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ తో కలసి సాహసాలు చేయనున్నాడు. జూలై, ఆగస్ట్ నెలల్లో రణవీర్ సైబీరియాలో కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ తో కూడిన షూట్ కి సిద్ధం అవుతున్నాడు! Read Also: అవికా గోర్ బర్త్ డే హంగామా మామూలుగా లేదుగా! సూపర్ ఫిట్ నెస్ ఉంటేనే ఎవరైనా గ్రిల్స్ అడ్వెంచర్…
బాలీవుడ్ లో చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఓటీటీ బాట పడుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న యాక్టర్స్ మాత్రమే కాదు కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన వారు కూడా డిజిటల్ జోష్ ప్రదర్శిస్తున్నారు! తమ ఫ్యామిలీలో ఇప్పటికే సీనియర్ బచ్చన్, జూనియర్ బచ్చన్ ఓటీటీ బాట పట్టగా జయా బచ్చన్ కూడా వెబ్ సిరీస్ కి సై అంటోంది! 5 ఏళ్ల తరువాత మళ్లీ తెర మీదకు రాబోతోంది… జయా బచ్చన్ ‘సదా బహార్’…
నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించి షూటింగ్ ముగించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించిన తేదీకే రాధేశ్యామ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు ఇటీవల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాని ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.…
గత యేడాది విడుదల కావాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో ఈ యేడాది విడుదలయ్యాయి. అలా ‘చెక్’తో పాటు ‘రంగ్ దే’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయ్యియి. కానీ వాటికి ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నితిన్ ‘మాస్ట్రో’ చిత్రం మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెన్స్ కనిపిస్తున్నాయి. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది…
మొత్తం దేశంలోనే కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా కొనసాగుతోంది. చెన్నై సహా రాష్ట్రమంతటా స్ట్రిక్ట్ లాక్ డౌన్ విధించారు. మరి ఇటువంటి సమయంలో సినిమా కష్టాలకు కొదవుంటుందా? కోలీవుడ్ లో చాలా సినిమా థియేటర్లు లేక రిలీజ్ అవ్వటం లేదు. అంతకంటే ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ దశలో, పోస్ట్ ప్రొడక్షన్ దశలో నిలిచిపోయాయి. అందుకే, అన్ని విధాల తమ సినిమాలు పూర్తైన దర్శకనిర్మాతలు ఓటీటీ వేదికలకు జై కొడుతున్నారు. ఈ లిస్ట్…
ఓటీటీ వేదిక తొలి లాక్ డౌన్ లో ఏ మేర కొత్త వీక్షకులను సృష్టించుకుందో.. రెండో దశ లాక్ డౌన్ లో అంతకుమించి కొత్త వీక్షకులను సృష్టించుకుంది. ఫలితంగా ఓటీటీ వేదికల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఓటీటీలో విచ్చలవిడిగా ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని కేరళ ప్రభుత్వమే త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాచిత్రం వకీల్ సాబ్ థియేటర్లలోనే కాదు.. ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. కాగా, తాజాగా ‘వకీల్‌సాబ్’ సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్‌ని రీక్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో రూపొందించారు. కెమెరా…
కరోనా పరిస్థితులు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో తెలియదని పరిస్థితి నెలకొంది. దీంతో థియేటర్లు సైతం ఇప్పట్లో తెరచుకొనే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న సినిమాలకి ఒక్కటే ఆప్షన్ ‘ఓటీటీ’.. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యి ఆదరణ పొందగా.. మరిన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘వరుడు కావలెను’ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగశౌర్య-రీతువర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది.…
మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. రియా చక్రవర్తి – రచితా రామ్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలమే అయింది. గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.…