ఆ బాబాయ్, అబ్బాయ్‌కి పొలిటికల్‌గా చుక్కలు కనిపిస్తున్నాయా? వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాల్లా ఏలిన ఇద్దరికీ ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా? వీళ్ళిద్దరి విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? గతం వదల బొమ్మాళీ... అంటున్న ఆ బాబాయ్, అబ్బాయ్ ఎవరు? ఏంటి వాళ్ళ కథ?
బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య పొలిటికల్ అడుగులు తడబడుతున్నాయా? లేక తడబాటును సరి చేసుకుంటున్నారా? రాజకీయ రంగుల కంటే ఉద్యమ పంథానే బెటరని అనుకుంటున్నారా? లేక కొత్త పార్టీ గడప తొక్కబోతున్నారా? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక కృష్ణయ్య వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు బయటికి ఎక్కువగా రావడం లేదు? ఎన్నికల తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించడం వెనకున్న అసలు రీజనేంటి? బయట జరుగుతున్న రకరకాల చర్చలకు మించిన మాస్టర్ ప్లాన్ ఉందా? నన్ను ఓడిస్తే... వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని గతంలో అన్న మాటల్ని నిజం చేస్తున్నారా? లేక సమయం ఉంది మిత్రమా.... అంత తొందరేల అంటున్నారా? అసలేం జరుగుతోంది?
ఆ ఎమ్మెల్యే అడుసు తొక్కేసి కాలు కడుక్కోవడానికి, కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? పవర్ ఉంది కదా అని రెచ్చిపోయి నోటికి పని చెప్పిన శాసనసభ్యుడికి ఆ పవర్ కట్ చేస్తామంటూ పార్టీ పెద్దల నుంచి వార్నింగ్ వచ్చిందా? ఆయనగారి నోటి దురుసుపై సొంత పార్టీ నేతలు సైతం ఒక్కొక్కరే బయట పడుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బూతు పురాణం?
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా...రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా... ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పర్సనల్‌గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్ లీడర్‌కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? ఆయన కత్తులు నూరుతున్న ఆ సీనియర్ ఎవరు?
తిరుమల శ్రీవారికి మహా భక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంతలా అంటే... సాధారణ భక్తులు ఎవ్వరికీ వీలవని విధంగా వారానికోసారి, కుదిరితే రెండు సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. మరి అంతటి భక్తి ఉన్న నాయకురాలు శ్రీవారి మహా ప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా.. ఎందుకు మాట్లాడటం లేదు? అసలా విషయమే తెలియదన్నట్టుగా కామైపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏమా భక్తిరస కథాచిత్రమ్?
గులాబీ పార్టీ ట్రాక్ అండ్ ట్రెండ్ మార్చాలనుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కునే ప్లాన్‌కు పదును పెడుతోందా? అటు సీనియర్స్‌ని సంతృప్తి పరచడం, ఇటు పార్టీ అవసరాలు తీర్చుకోవడమన్న రెండు పిట్టల్ని ఒకే దెబ్బకు కొట్టాలనుకుంటోందా? జనంలోకి దూకుడుగా వెళ్ళడానికి బీఆర్‌ఎస్ వేస్తున్న కొత్త స్కెచ్ ఏంటి? దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది?
నా రూటే సెపరేటు అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి.... కొంతకాలంగా మనిషొక దగ్గర మనసొక దగ్గర అన్నట్టుగా ఉంటున్నారట ఆ లీడర్.... పంటికింద రాయిలా మారిన ఆయన్ని ఎలా అటాక్ చేయాలా అని చూస్తున్న వారికి ఆయనే స్వయంగా ఆయుధం ఇచ్చేశారట. చుట్టూ సొంత మనుషులే చక్ర బంధం వేస్తున్న ఆ లీడర్ ఎవరు? ఏంటా పొలిటికల్ స్టోరీ?