కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మృతిచెందారు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్దనున్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో కమల్ భాష (50), మున్నా (35), షేక్ నదీయా (3) మృతిచెందగా.. మరో ఆరుగురుకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్ లో చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. వాతావరణంలో మార్పులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆ టూర్‌ను క్యాన్సిల్ చేశారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా పర్యటించనున్నారు. అయితే, సీఎం చంద్రబాబు.. కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఆయన పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో పర్యటించాల్సి ఉండగా.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయ్యింది. దానికి బదులుగా ఓర్వకల్‌లో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు... అక్కడ ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు.
Minister TG Bharath: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన పరిశ్రమను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పూర్తవ్వలేదు అన్నారు.