‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది, ఆగస్టు 11–17, 2025 వారానికి గానూ ఓర్మాక్స్ మీడియా ఓ సర్వేని వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ట్రీమింగ్ షోల జాబితాలో ‘మయసభ’ 3వ స్థానంలో ఉందని ఓర్మాక్స్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ 2.8 మిలియన్ల వీక్షణలతో పాన్-ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించింది. భాషా సరిహద్దుల్ని చెరిపేస్తూ అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ‘మయసభ’ మెప్పిస్తోంది. Also Read : Suhas: తమిళ్లో జెండా పాతేట్టున్నాడే!…
ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. 2010లో ‘ఏ మాయ చేశావే’తో సినీ రంగంలోకి వచ్చిన ఆమె, ‘ఈగ’, ‘తేరి’, ‘మజిలీ’, ‘మేర్సల్’ లాంటి హిట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సమంత రూత్ ప్రభు ఆర్మాక్స్ మీడియా జూలై 2025 ర్యాంకింగ్‌లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్‌గా సమంత టాప్ స్థానంలో నిలిచింది.…
Today (15-02-23) Business Headlines: షార్ట్ సెల్లింగ్‌ని నిషేధించం: ఈక్విటీ మార్కెట్‌లో షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించే ఉద్దేశం లేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. షార్ట్ సెల్లింగ్ అనేది అవసరమేనని, దానివల్ల షేర్ల అసలు విలువను కనిపెట్టొచ్చని అభిప్రాయపడింది. 2020వ సంవత్సరం మార్చి నెలలో.. అంటే.. కరోనా ప్రారంభ సమయంలో.. 13 రోజుల్లోనే నిఫ్టీ విలువ 26 శాతం పతనమైనప్పటికీ షార్ట్ సెల్లింగ్‌పై నిషేధం విధించలేదని గుర్తుచేసింది.
Indian Box Office Report: 2022వ సంవత్సరంలో సినిమా థియేటర్లు దద్దరిల్లాయి. ప్రేక్షకులతో హౌజ్‌ఫుల్ అయ్యాయి. మూవీలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. 2019వ సంవత్సరం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సంవత్సరంగా 2022 రికార్డులకెక్కింది. 2019లో మన దేశంలోని అన్ని భాషల చలన చిత్రాలు 10 వేల 637 కోట్ల రూపాయలను ఆర్జించాయి. 2019తో పోల్చితే 2022లో 300 కోట్లు మాత్రమే తక్కువ వచ్చాయి.
Indian Box Office Report: 2022లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు 10 వేల కోట్ల రూపాయల మార్క్‌ను చేరుకున్నాయి. నవంబర్‌కు సంబంధించిన ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ నెలలో.. హిందీలో వచ్చిన దృశ్యం-2 మూవీ అన్ని భాషల చిత్రాల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ ఒక్క పిక్చర్ మాత్రమే నవంబర్‌లో వంద కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్‌ను క్రాస్ చేయటం విశేషం.
The India Box Office Report-October: అక్టోబర్‌కు సంబంధించిన ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ నెలలో దేశం మొత్తమ్మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది? తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవుళ్లకు సమగ్రంగా సమర్పిస్తోంది.
The Indian Box Office Report-September 2022: మన దేశంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి వారం, ప్రతి నెలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని మూవీలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. చాలా కొద్ది పిక్చర్లు మాత్రమే హిట్ అవుతున్నా భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అందుకే.. ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్టుకు బిజినెస్‌పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.