Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
కాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ నిర్వహించిన సమావేశంలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో తాజాగా చర్చించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి రాజ్నాథ్ తీసుకెళ్లనున్నారు.
Rashmika : పాకిస్థాన్ మీద ఇండియా సాగిస్తున్న యుద్ధానికి దేశ ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఆర్మీకి సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక కూడా మద్దతు తెలుపుతూ పోస్టు పెట్టింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడటం మన హక్కు అంటూ తెలిపింది. చాలా మంది అమాయక పౌరులను చంపితే కచ్చితంగా న్యాయం చేయాల్సిందే అంటూ చెప్తోంది. టెర్రరిస్టల దాడిలో అమాయకులు చనిపోతే.. కచ్చితంగా దానికి బదులు తీర్చుకోవాలని..…
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది.
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడారు.
Operation Sindoor : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ vs పాక్ ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఆకాశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక ఎయిర్ వార్నింగ్ వ్యవస్థ అయిన AWACS విమానం భారత వైమానిక దళం చర్యతో కూలిపోయింది. ఇది కేవలం ఓ విమానం నష్టం కాదు, దాయాది దేశానికి వ్యూహాత్మకంగా చెమటలు పట్టించే పరిణామం. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై…
Rohit Sharma: భారత్–పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి ఇంట్లో ఈ కీలక సమావేశం జరిగింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్న చందంగా మారింది. భారత్తో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి పెను శాపంగా పరిణమించింది. ఆర్థికంగా దివాళా తీసిన పాక్, ఇప్పుడు నిధుల కోసం ప్రపంచ దేశాల ముందు ఆర్తనాదాలు చేస్తోంది. తొందరపాటుతో యుద్ధానికి దిగిన పాక్, భారత దాడులతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ భాగస్వాములను, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకును…