Iran-israel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ – ప్రత్యర్థి దేశమైన ఇరాన్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ (Complete and Total Ceasefire) కి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ విరమణను వచ్చే 24 గంటల్లో దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు. “ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకి అంగీకారమైంది. దాదాపు ఆరు గంటల లోపు ఇరువురు తమ…
ఇరాన్ సైనిక, అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో చేరాలా వద్దా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ఇజ్రాయెల్, ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా డిమాండ్లకు సంబంధించి దౌత్యం కోసం ట్రంప్ ఇప్పటికీ ఒక అవకాశాన్ని చూస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. “ఇరాన్‌తో సమీప భవిష్యత్తులో చర్చలు జరిగే అవకాశం ఉందా లేదా అనే దానిపై ఆధారపడి, రాబోయే రెండు వారాల్లో నేను నా…
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. రాజస్థాన్‌లోని…
Iran Nuclear Site: ఇజ్రాయెల్ చేపట్టిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట నిర్వహించిన వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ అణుశక్తి కేంద్రాల్లో సంభవించిన నష్టాన్ని స్పష్టంగా చూపించే ఉపగ్రహ చిత్రాలను మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసింది. ఈ చిత్రాలలో నాటాంజ్, ఫోర్డో ఇంకా ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని కీలక అణు కేంద్రాలపై జరిగిన దాడుల ముందు, తర్వాత పరిస్థితుల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడులలో నాటాంజ్ అణు కేంద్రం పైభాగంలోని కీలక నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, అంతర్జాతీయ అణు…
PM Modi: ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యహు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఈ సంభాషణలో మోడీ ప్రస్తుత పరిస్థితులపై తన ఆందోళనను వ్యక్తపరిచారు. అలాగే ఆ ప్రాంతంలో తొందరగా శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనాల్సిన అవసరాన్ని బెంజమిన్ నెతాన్యహుకు తెలిపారు. మోడీ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో.. “ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు ఫోన్‌లో నన్ను సంప్రదించారు. ఆయన ప్రస్తుత పరిస్థితులను…
పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే, ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు.. దీనిపై ఆ దేశం చర్చలకు రావాల్సిందే.
ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్‌కు అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.