Chandrababu: బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో ఆపరేషన్ బుడమేరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జలవనరుల శాఖ ఈఎన్సీ, ఎస్.ఇ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. బెజవాడ దుఃఖ దాయనిగా పిలవబడుతున్న బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికపై సమీక్ష నిర్వహించామని తెలిపారు.