ఓ యువతిని మోసం చేసిన ఉగాండా వ్యక్తిని పోలీసులు సినీఫక్కీలో అరెస్టు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన ఓ యువతికి ఉగాండాకు చెందిన “నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్” అనే వ్యక్తి ఫోన్ చేసి ఆన్‌లైన్ లాటరీలో రూ2.5 కోట్ల వచ్చాయని నమ్మించాడు. ఈ నేపథ్యంలో లాటరీ డబ్బులు రావాలంటే ట్యాక్స్‌లు కట్టాలంటూ సదరు యువతి నుంచి మొదట రూ.3.5 వేలు, తర్వాత రూ.12.5…