రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. కేవైసీ, స్టాక్ మార్కెట్ పేరుతో లక్షలు మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. కేటుగాళ్ల వలలో చిక్కి ప్రజలు లక్షలు మోసపోతున్నారు. ఇలాంటి ఘటనలు తాజాగా రెండు చోటు చేసుకున్నాయి. ఎస్బీఐ అకౌంట్‌కు చెందిన కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ.. బ్యాంకు అధికారిగా ఓ మహిళకు కేటుగాళ్లు ఫోన్ చేశారు. కేవైసీ అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని సదరు మహిళను చీటర్స్ భయపెట్టారు. దీంతో నిజమని నమ్మిన ఆ మహిళ బ్యాంకు వివరాలన్నీ చెప్పి, మొబైల్ కు వచ్చిన ఓటీపీ కూడా చెప్పింది.
అది చెప్పిన క్షణాల వ్యవధితో అకౌంట్‌లో నుంచి రూ.15లక్షలు కేటుగాళ్లు కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించింది. ఇదిలా ఉంటే.. స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు పొందవచ్చని, ఓ మహిళకు ఆన్‌లైన్ లో పరిచయమైన వ్యక్తి స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ మహిళతో 7లక్షలు పెట్టుబడిగా పెట్టించి ఆ మొత్తాన్ని కాజేశాడు. లాభాలను చూసుకునేందుకు ప్రయత్నించగా..ఆ మహిళ మోసపోయానని తేరుకుంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!