ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBOMMA) నిర్వాహకుడు రవి కేసులో తాజాగా సీఐడీ (CID) రంగంలోకి దిగింది. పైరసీ సినిమాలు అందిస్తూనే, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. మొదటి రెండు రోజులు విచారణలో రవి సరిగా సహకరించలేదని సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసింది డబ్బుల కోసమే అని రవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రవికి సంబంధించిన ఖాతాల వివరాలు అందించాలని పోలీసులు ఇప్పటికే బ్యాంకులకు లేఖలు రాశారు. ఆర్థిక లావాదేవీలపై పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
Also Read : Mohan Bhagwat: హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
రవి కేసులో సీఐడీ ప్రవేశించడంతో దర్యాప్తు మరింత ముమ్మరమైంది. రవి ఐబొమ్మ తో పాటు బప్పం వంటి వెబ్‌సైట్‌ల ద్వారా సినిమాలు పైరసీ చేసి ఉచితంగా విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పైరసీ వెబ్‌సైట్ల ద్వారానే ఏకంగా నాలుగు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశాడు. ఈ బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా రవి వందల కోట్ల రూపాయల లాభం పొందినట్లు సీఐడీ అనుమానిస్తోంది. బెట్టింగ్ యాప్‌లపై ఇప్పటికే విచారణ జరుపుతున్న సీఐడీ, ప్రస్తుతం రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను, లాభాలను ఏ విధంగా తరలించాడనే అంశాలపై దృష్టి సారించింది.
ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.