తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఆగొద్దని మళ్లీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలవాలని ఆకాంక్షిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నవాబుపేట్ మండలంలోని చెన్నారెడ్డి పల్లె, కేశవరావు పల్లె గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు దాదాపు 40 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.