దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరుగుతున్నది. ఒమిక్రాన్ కేసులు పెరిగే కొలది కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఆరునెలల తరువాత మరలా ఢిల్లీ, ముంబై లో కేసులు పెరుగుతుండటంతో దేశం అప్రమత్తం అయింది. శనివారం రోజున ఢిల్లీలో 38శాతం కేసులు పెరగ్గా, ముంబైలో 10శాతం కేసులు పెరిగాయి. ఢిల్లీలో శనివారం రోజున 249 కొత్త కేసులు నమోదవ్వగా, ముంబైలో 757 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ముంబైలో నైట్ కర్ఫ్యూతో…
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమ క్రమంగా పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 41 కి ఒమిక్రాన్ కేసుల సంఖ్య చేరింది. ఇవాళ ఒమిక్రాన్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు… విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అయితే.. ఈ ముగ్గురు ఇంకా ఎవరినైనా కలిసారా.. అనే దానిపై వైద్య అధికారులు ఆరా తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా..తెలంగాణ రాష్ట్రంలో న్యూ…
కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడలేదు. కరోనా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించినట్టు సమాచారం. రాజస్థాన్‌లో 21, దిల్లీలో 12, కేరళలో 8 ఒమిక్రాన్ కేసులు కొత్తగా బయటపడడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమిళనాడులో ఒమిక్రాన్ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో అంతా అలర్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని…
వైద్య, ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా వుందన్నారు. ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కళ. రామలింగన్న కోరిక.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వరం దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దుబ్బాక మీద చాలా ప్రేమ వుందన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి సంతోషిస్తాడు. స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో కాని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం…
ఒమిక్రాన్ వేరియంట్‌తో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బ్రిటన్‌లో 1,22,186 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తరువాతనే కరోనా వ్యాప్తి ఈ స్థాయికి చేరింది. మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. Read: ఇంతకంటే ఆనందం ఇంకేంకావాలి… ఆనంద్ మహీంద్రా ట్వీట్… డిసెంబర్…
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా పెరుగుతున్నవేళ అనేక దేశాల్లో ఐదు రోజుల పనివేళలను నాలుగు రోజులకు కుదిస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 2020 నుంచి ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు వీలు లేకపోవడంతో వర్క్‌ఫ్రమ్ హోమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు వివిధ దేశాలు సిద్ధమయ్యాయి. రోజుకు పనివేళలను పెంచి, పని దినాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాయి. Read: లైవ్: పులివెందుల…
ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ దాడులు చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒమిక్రాన్ దెబ్బకు దేశాలకు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ యూరప్, అమెరికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంమీద లక్షన్నర కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఇండియాలో నిర్వహించారు. అయినప్పటికీ కేసులు…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డెల్టా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, ఒమిక్రాన్ వ్యాప్తిని, తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు. మహారాష్ట్రలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంతల వరకు నేట్ కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలోనే అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు, డెల్టా కేసులు నమోదవుతున్నాయి. హర్యానా, గుజరాత్‌లో రాత్రి 11 గంటల…
రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6…