కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం కోలుకోలేదు. సార్స్ కోవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతూనే ఉన్నది. వ్యాక్సినేషన్ తరువాత కరోనా మహమ్మారి కేసులు తగ్గిపోతాయి వచ్చే ఏడాది నుంచి తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేయవచ్చని కంపెనీలు భావించాయి. డెల్టా నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఒమిక్రాన్ ప్రభావం చూపించడం మొదలైంది కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఆసియా దేశాల్లోనూ క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.
Read: కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్…
దీంతో టెక్ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి పనులు చేయాలని అనుకున్నా కుదిరేలా కనిపించడం లేదు. రోజు రోజుకు తీవ్రత పెరిగిపోతుండటంతో ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. గూగుల్, ఫోర్డ్, ఫేస్‌బుక్, లిఫ్ట్ తదితర కంపెనీలన్నీ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశాలు జారీ చేయనున్నాయి. ట్విట్టర్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.