భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌లో 33,750 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 123 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో మృతి…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రాలో నైట్ కర్ఫ్యూతో పాటు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక తాజాగా, పశ్చిమ బెంగాల్‌లోనూ కఠినమైన ఆంక్షలు అమలుకాబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచి విద్యాసంస్థలు, పార్కులు, జిమ్ లు, సెలూన్లు, బ్యూటీపార్లర్లు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 50 శాతం ఉద్యోగులతోనే కార్యాలయాలు నడవబోతున్నాయి. లోకల్ రైళ్లు సైతం 50 శాతం సీటింగ్‌తోనే నడుస్తాయి. Read:…
ఒకవైపు కోవిడ్ వ్యాప్తి, మరోవైపు ఒమిక్రాన్ దాడితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. అందుకే భారత ప్రభుత్వం 15-18 ఏళ్ళ వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర…
కరోనా మహమ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది. ఆర్ ఫ్యాక్టర్ ఇప్పటికే 2 గా నమోదంది. ఆర్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే వైరస్ తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్రప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని, కానీ ప్రజలెవరూ ప్యానిక్ కావొద్దని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయని, ఈరోజు 3100 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని…
మరోసారి కరోనా రక్కిసి రెక్కలు చాస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత 15 రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా సుమారు 7 వేల లోపు కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా కేసులు రాగా, 284 మంది కరోనా బారినపడి మృతిచెందారు. గడిచిన 24…
యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి ప్రపంప దేశాలపై విరుచుకుపడుతోంది. అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ ప్రభావంతో కరోనా కేసులు కూడా భారీ పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.39 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తాజాగా…
దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. సినిమా హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గురుగ్రామ్, ఫరీదాబాద్ తో పాటు మూడు జిల్లాల్లో రూల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 12 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే హర్యానాలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. హర్యానాలో…
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా డెల్టా వేరియంట్ కేసులు, ఇప్పుడు మరోసారి భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాల్లోకి ప్రవేశించింది. దీంతో ఒమిక్రాన్ కేసులు కూడా యూఎస్, యూకే లాంటి దేశాల్లో అధికంగానే నమోదవుతున్నాయి. వీటితో పాటు ఒమిక్రాన్ మరణాలు సంభవించడంతో ఆయా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. రోజురోజుకు ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ నుంచి 27 మంది కోలుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. ఇందులో…