ఒమిక్రాన్ కేసులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఇప్పటికే 90కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. జనసంచారంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్క్, శానిటైజర్‌లు తప్పనిసరి చేశారు. ఒమిక్రాన్ కారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి.
Read: వాహనప్రియులకు శుభవార్త: 2022 లో ఎలక్ట్రిక్ కార్ల హంగామ షురూ…
2022 జనవరి 17 నుంచి 21 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం జరగాల్సి ఉంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అనేక మంది హాజరుకావాల్సి ఉంటుంది. కఠినమైన హెల్త్ ప్రొటోకాల్స్ అమలులో ఉన్నప్పటికీ ఒమిక్రాన్ తీవ్రత కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ స్పష్టం చేసింది. ఈ సమావేశాన్ని వచ్చే ఏడాది వేసవిలో నిర్వహిస్తామని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలియజేసింది.