శ్రీనగర్‌లోని రాజ్ భవన్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ సీనియర్ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ముబారక్ గుల్ చేత ప్రమాణం చేయించారు.
Jammu Kashmir: దాదాపుగా 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం 90 స్థానాల్లో 48 గెలిచాయి. అయితే, ఎన్సీ 42 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 06 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఎన్సీకి ఇండిపెండెంట్లు, ఆప్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ…
Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రెండోసారి నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎం కానున్నారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్…
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు.
Presidents rule revoked in Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో సమైక్య రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన నోటిఫికేషన్‌లో జమ్మూ & కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 (34/2019) సెక్షన్ 73 ద్వారా అందించబడిన…
ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోడీకి సమర్పిస్తామన్నారు. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా లాంటి వాటి మీద తీర్మానం చేస్తామన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని.. హంగ్ ఏర్పడడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. కానీ ఈవీఎంల ఫలితాలు వచ్చేటప్పటికీ అంచాలన్నీ తలకిందులయ్యాయి.
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.
Omar Abdullah: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘IC814: కాందహార్ హైజాక్’ సంచలనంగా మారింది. ఇందులో ఉగ్రవాదులను హిందూ పేర్లతో పిలవడంపై రచ్చ మొదలైంది. అయితే, కేంద్రం వార్నింగ్‌తో మరోసారి ఇలాంటి ఘటన జరగదని నెట్‌ఫ్లిక్స్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా కూడా వేడిని పెంచుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది