పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతను పరిష్కరించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే.. కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు గంటల తర్వాత.. పాకిస్థాన్ సైన్యం మళ్లీ భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.
భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శ్రీనగర్ మీదుగా పెద్ద ఎత్తున డ్రోన్ కార్యకలాపాలు జరిగినట్లు సమాచారం. శ్రీనగర్‌లో జరిగిన డ్రోన్ దాడి వీడియోను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. పాకిస్థాన్ భారీ షెల్లింగ్‌కు దిగిందని.. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు."ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే తెరుచుకున్నాయి" అని సీఎం…
పహల్గామ్ ఉగ్రదాడి భారత్‌ను భగ్గుమనేలా చేసింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధంలాంటి పరిస్థితి దాపురించింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ సమాచారాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంతలో పలువురు రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై మాట్లాడారు.
Omar Abdulla : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “భారత సరిహద్దులపై పాకిస్తాన్ షెల్లింగ్ చేయడానికి IMF డబ్బులు తిరిగి చెల్లిస్తోందా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో ఒమర్ అబ్దుల్లా చేసిన పోస్ట్ సంచలనం రేపింది. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతంలో శాంతిని ఎలా ఆశిస్తున్నాయని ఆయన నిలదీశారు. “పూంచ్,…
రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు.
India-Pak War : దాయాది పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతోంది. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో మరోసారి కాల్పులకు తెగబడింది. ఈ క్రమంలోనే శ్రీ నగర్ లో లైట్లు ఆర్పేసి బ్లాకౌట్ నిర్వహించడానికి సైనికులు నిర్ణయించారు. ఇదే విషయం ప్రజలకు చెప్పడానికి మసీదు లౌడ్ స్పీకర్లను ఉపయోగించారు. ‘జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. శ్రీ నగర్ లో మొత్తం బ్లాకౌట్. కానీ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.…
Omar Abdullah: పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు.
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారి మౌలిక స్వేచ్ఛను పెంచడం దీని లక్ష్యం. మార్చి 8న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో తన ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ…
Kashmiri MBBS Student: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన సెకండ్ ఇయర్ MBBS విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంఘటనచడ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్పందించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌లో సోమవారం జెడ్-మోర్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ నేడు అభివృద్ధిలో కొత్త కథను రాస్తోందన్నారు. ఇంతకుముందు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ భూమిపై స్వర్గంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని తెలిపారు.