జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్గాం అసెంబ్లీ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. కుటుంబానికి కంచుకోటగా ఉన్న గండర్‌బాల్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఒక స్థానాన్ని వదులుకోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బుద్గాం స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ త్వరలో ఉప ఎన్నిక రానుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ -కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈనెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడింది.
ఇది కూాడా చదవండి: Botsa Satyanarayana: డయేరియా మరణాలకు కూటమి సర్కారే కారణం.. బొత్స కీలక వ్యాఖ్యలు
గందర్‌బల్ నుంచి 10,574 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా.. బుద్గాం నుంచి 18,485 ఓట్ల ఆధిక్యంతో ఒమర్ గెలుపొందారు. ఒమర్ అబ్దుల్లా గందర్‌బాల్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నట్లు జమ్మూకశ్మీర్ ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ సభలో ప్రకటించారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి అగా సయ్యద్ ముంతజీర్ మెహదీపై 18,485 ఓట్లతో ఒమర్ విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా కుటుంబానికి గందర్‌బాల్ నియోజకవర్గం బలమైన కోటగా ఉంది. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గందర్‌బల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎస్సీని స్థాపించిన అతని తండ్రి ఫరూక్ అబ్దుల్లా మరియు తాత షేక్ అబ్దుల్లా ప్రాతినిధ్యం వహించారు.
ఒమర్ అబ్దుల్లా.. బుద్గాంను ఖాళీ చేయడంతో 95 మంది సభ్యుల సభలో నేషనల్ కాన్ఫరెన్స్ బలం 41కి తగ్గింది. అయితే ఎన్సీ ప్రభుత్వానికి ఇప్పటికీ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్రులు, ఆప్ మరియు సీపీఐకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే మద్దతుతో మెజారిటీ ఉంది.
ఇది కూాడా చదవండి: Mamata Banerjee: పెరిగిన ఔషధాల ధరలపై ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ..