స్వతంత్ర భారత్ కు తొలి ఒలింపిక్ పతకం రెజ్లింగ్ లోనే వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఇది తొలిపతకం.అప్పటి నుండే దేశంలో రెజ్లింగ్ పై ఆసక్తి పెరిగింది. గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లర్లు భారత్‌కు పతకాలు సాధించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ సాధించిన కాంస్య పతకం భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ మళ్లీ తన పట్టు నిలబెట్టుకొని రజతం సంపాదించగా… యోగేశ్వర్…
రెజ్లింగ్ పై ఆశలు గట్టిగానే ఉన్నాయి. షూటింగ్ గురి తప్పదనే నమ్మకం ఉంది..అథ్లెటిక్స్ లో అంతంత మాత్రంగానే ఉన్నా, హాకీలో అద్భుతాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. ఓవరాల్ గా భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నారు. భారత్ ఖాతాలో ఎన్ని పతాకాలొస్తాయనే అంశంపై చాలా అంచనాలున్నాయి. నిజానికి ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే భారత్‌కు లభించిన పతకాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయితే, టోక్యోలో భారత్ డబుల్ డిజిట్…
కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు. అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్‌ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో హంగామా చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అటు అంతర్జాతీయ వాలంటీర్లు కూడా టోక్యో రావడానికి వీల్లేదు. జపాన్‌లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14…
ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున అతిపెద్ద బృందం టోక్యోలో ఉంది.కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులతో కలిపి మొత్తం 228 మంది ఒలంపిక్స్ లో భాగమయ్యారు. ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు రజతం సాధించగా… మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. రియో క్రీడల్లో భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది…
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. క్రీడా గ్రామంలో పలువురు అథ్లెట్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో విశ్వక్రీడల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, ఒలింపిక్స్ నిర్వాహకులు అలాగే ముందుకు సాగుతున్నారు. ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ టీమ్ కి చెందిన ఇద్దరి ఆటగాళ్లు వైరస్ బారిన పడగా.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇక మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు…
ఢీల్లి నుంచి ప్రత్యేక విమానంలో టోక్యోకు వెళ్లారు భారత అథ్లెట్లు. ఈనెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతుండటంతో భారత అథ్లెట్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దిల్లీ నుంచి బయలుదేరుతుండంగా పతకాలతో తిరిగి రావాలని అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారత షూటర్లు నిన్న ఉదయమే టోక్యోకు చేరుకున్నారు. క్రొయేషియా నుంచి భారత షూటర్లు వెళ్ళడంతో క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఢీల్లి నుంచి బయలుదేరిన భారత అథ్లెట్ల బృందం మాత్రం మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో…
ఏ-క్వాలిఫికేషన్ మార్కును అధిగమించి టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాడు భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్. దీంతో పోటీల ద్వారా విశ్వక్రీడలకు నేరుగా క్వాలిఫై అయిన తొలి భారత స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇటలీలోని రోమ్ వేదికగా జరిగిన సెటెకోలీ ట్రోఫీ 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ఒక నిమిషం 56 సెకన్లలోనే గమ్యాన్ని చేరి.. టోక్యో ఒలింపిక్స్‌కు ‘ఏ’ స్టాండర్డ్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో పాటు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును…
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టుకు రాణి రాంపాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుందని హాకీ ఇండియా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును గత వారం ప్రకటించిన హెచ్‌ఐ కెప్టెన్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక వైస్ కెప్టెన్‌లుగా గోల్‌కీపర్ సవిత, దీప్ గ్రేస్ ఎక్కా వ్యవహరిస్తారని తెలిపింది. ఒలింపిక్స్‌లో జట్టును నడిపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది రాణి. ఇప్పటివరకు దేశం తరఫున 241 మ్యాచ్‌లు ఆడి…
ఉగాండా ఒలింపిక్ బృందం జపాన్‌కు చేరుకుంది. వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా…