భారత రెజ్లింగ్ పై భారీ అంచనాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వతంత్ర భారత్ కు తొలి ఒలింపిక్ పతకం రెజ్లింగ్ లోనే వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఇది తొలిపతకం.అప్పటి నుండే దేశంలో రెజ్లింగ్ పై ఆసక్తి పెరిగింది. గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లర్లు భారత్‌కు పతకాలు సాధించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ సాధించిన కాంస్య పతకం భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ మళ్లీ తన పట్టు నిలబెట్టుకొని రజతం సంపాదించగా… యోగేశ్వర్ దత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని దక్కించుకొని దేశం గర్వపడేలా చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత మల్ల యోధులపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి భారత్ తరఫున ఏడుగురు బరిలో ఉండగా… అందులో కనీసం ముగ్గురు కచ్చితంగా పతకంతో తిరిగి వస్తారని క్రీడాభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
కొన్నేళ్లుగా బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్‌లో బజ్ రంగ్ పూనియా పైచేయి సాధిస్తున్నాడు.గత పది టోర్నీల్లో ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. బజరంగ్‌కు జపాన్, రష్యా, మంగోలియా, హంగేరి రెజ్లర్ల నుంచి గట్టిపోటీ లభించే అవకాశాలున్నాయి.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
రెండేళ్ల క్రితం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అందరి అంచనాలను తారుమారు చేశాడు రెజ్లర్ రవి దహియా తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రవి, రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచాడు. రష్యా, టర్కీ, జపాన్ రెజ్లర్ల నుండి గట్టిపోటీ లభించనుంది.
జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు నిలకడగా రాణిస్తున్న రెజ్లర్ దీపక్ పూనియా. 22 ఏళ్ల దీపక్ 2019 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి… అదే ఏడాది జరిగిన సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. పెద్దగా అంచనాలు లేకపోవడం దీపక్‌కు కలిసివచ్చే అంశం.
ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగి మోకాలి గాయంతో క్వార్టర్ ఫైనల్ బౌట్ మధ్యలోనే వైదొలిగింది వినేశ్ ఫోగట్. ఈసారి మాత్రం పతకంతో తిరిగి రావాలని పట్టుదలతో ఉంది. కౌంటర్ ఎటాక్ చేసే క్రమంలో ప్రత్యర్థులకు పాయింట్లు సమర్పించుకునే బలహీనత ఉన్న వినేశ్ దీనిని అధిగమిస్తే స్వర్ణం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వీరితో పాటు రెజ్లర్లు సీమా బిస్లా, అన్షు మలిక్, సోనమ్ మలిక్ లపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు