ఏ-క్వాలిఫికేషన్ మార్కును అధిగమించి టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాడు భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్. దీంతో పోటీల ద్వారా విశ్వక్రీడలకు నేరుగా క్వాలిఫై అయిన తొలి భారత స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇటలీలోని రోమ్ వేదికగా జరిగిన సెటెకోలీ ట్రోఫీ 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ఒక నిమిషం 56 సెకన్లలోనే గమ్యాన్ని చేరి.. టోక్యో ఒలింపిక్స్‌కు ‘ఏ’ స్టాండర్డ్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో పాటు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరుగరాశాడు. అలాగే ఒలింపిక్స్ ఏ క్వాలిఫికేషన్ మార్కు కంటే 0.19 సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరి సత్తాచాటాడు. క్వాలిఫయర్స్ ద్వారా 2016 రియో ఒలింపిక్స్‌లో సాజన్ బరిలోకి దిగాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో సాజన్‌తో పాటు భారత్ తరఫున మాన పటేల్ కూడా పాల్గొనబోతోంది.