Olivia Morris:ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ప్రస్తుతం ఈ పేరు ఇంటర్నేషనల్ మారుమ్రోగిపోతుంది. అవార్డులు.. రివార్డులు.. ఎక్కడ చూసినా అభిమానుల గెంతులు.. ఒకటి అని చెప్పడానికి లేదు. ఒక తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్.. షేక్ ఆడిస్తోంది. ఇక అవార్డుల విషయానికొస్తే లెక్కే లేదు.
RRR Pre Release Event ఈవెంట్ కు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. కర్ణాటక అడ్డా ఎన్టీఆర్ గడ్డ అంటూ వేడుక జరగనున్న స్థలానికి విచ్చేసిన ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హడావిడి మొదలెట్టేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్ ఈవెంట్ లో పాల్గొన్న మేకర్స్ శుక్రవారం రాత్రికి కర్ణాటకలో ల్యాండ్ అయ్యారు. భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్…
RRR సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే టైటిల్ విషయమై సోషల్ మీడియాలో హాట్ చర్చ నడిచింది. వర్కింగ్ టైటిల్ కే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులే సినిమాకు టైటిల్ ను సూచించాలని, అందులో తమకు నచ్చిన టైటిల్ ను ఎంచుకుని ఖరారు చేస్తామని రాజమౌళి టీం ప్రకటించారు. దీంతో RRRపైనే టైటిల్స్ వెల్లువెత్తాయి. అయితే రాజమౌళి మాత్రం సినిమా టైటిల్ “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్ ను…
RRR Press Meetలో రాజమౌళిని విలన్ ను చేసేశాడు ఎన్టీఆర్. అయితే అది సరదాకే అయినా ఆసక్తికరంగా మారింది. తాజాగా కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ త్రయం ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ “సినిమాలో చరణ్, నేను హీరోలము… కానీ విలన్ మాత్రం రాజమౌళి” అంటూ చమత్కరించారు. అయితే నిజానికి కోవిడ్ ‘ఆర్ఆర్ఆర్’కు అసలు విలన్ గా మారిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా సినిమా విడుదల…
RRR ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీం RRR Press Meetను నిర్వహించింది. అందులో రాజమౌళి కొత్త సీక్రెట్ ను రివీల్ చేశాడు. నిజానికి ముందుగా అనుకున్న “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ఇది కాదట. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో “ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ ఈవెంట్ కు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వేడుకకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా,…
RRR Pre Release Event నేడు కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం కర్ణాటకలో ల్యాండ్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ముందుగానే ప్రకటించిన మేకర్స్ ఈ వేడుకకు ముఖ్య అతిథి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాబోతున్నారని ప్రచారం జరిగింది.…
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో బయటపడ్డాయి. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. దాంతో చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్రి చరణ్ కారులో తాను బయటకు వెళ్ళిపోయేవాడినని తారక్ చెప్పాడు. తన భార్య ఫోన్ చేసి…
మాగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉంది. దాంతో ప్రచార ఆర్భాటాన్ని నిదానంగా పీక్స్ కు తీసుకెళ్ళే పనిలో రాజమౌళి బృందం పడింది. తాజాగా ఎన్టీయార్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళిని కూడా కలిపి దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూను మీడియాకు ఇచ్చారు మేకర్స్. విశేషం ఏమంటే అనిల్ రావిపూడి సినిమాల మాదిరే ఈ ఇంటర్వ్యూ కూడా ఫన్ రైడ్ తరహాలో సాగిపోయింది. అందులో…
RRR Pre Release event పై అధికారిక ప్రకటన వచ్చేసింది. RRR భారతదేశపు అతిపెద్ద మల్టీస్టారర్ ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక మార్చ్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు మేకర్స్. ముఖ్యంగా కర్ణాటకలో భారీ ఈవెంట్ జరగనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన…