RRR Pre Release Event ఈవెంట్ కు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. కర్ణాటక అడ్డా ఎన్టీఆర్ గడ్డ అంటూ వేడుక జరగనున్న స్థలానికి విచ్చేసిన ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హడావిడి మొదలెట్టేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ కర్ణాటక లోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా దుబాయ్ ఈవెంట్ లో పాల్గొన్న మేకర్స్ శుక్రవారం రాత్రికి కర్ణాటకలో ల్యాండ్ అయ్యారు. భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు దివంగత స్టార్ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, నటుడు శివరాజ్ కుమార్ కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఈవెంట్స్ ఏమీ లేవు.
Read Also : RRR Press Meet : అభిమానుల వల్లే ఆ టైటిల్… మరి అసలు టైటిల్ ఏంటి?
కానీ కర్ణాటకలో మాత్రం ఇంత భారీ ఈవెంట్ ను ఎందుకు నిర్వహిస్తున్నారు ? అనే డౌట్ ఎవ్వరికైనా రాకమానదు. అంతేకాకుండా కర్ణాటకలోని బెంగుళూరు వంటి సిటీలెన్నో ఉండగా చిక్కబళ్లాపూర్ నే రాజమౌళి ఎందుకు ఎంచుకున్నాడు? అనే అనుమానం అందరికీ వచ్చింది. అయితే చిక్కబళ్లాపూర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఎందుకు అయ్యింది అంటే… చిక్కబళ్లాపూర్ అనే ప్రాంతం ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ తెలుగు ప్రజలు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ ఈవెంట్ ను నిర్వహిస్తే తెలుగు, కన్నడ ప్రేక్షకులు ఇద్దరినీ కవర్ చేసినట్టుగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. కాబట్టి అంతమందిని మేనేజ్ చేయాలంటే చిక్కబళ్లాపూర్ లాంటి ప్లేస్ కరెక్ట్. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మేకర్స్ ఈ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారట.