(జూన్ 18న ‘ఓ మనిషీ! తిరిగిచూడు!!’కు 45 ఏళ్ళు) దర్శకరత్న దాసరి నారాయణరావు సామాన్యుల పక్షం నిలచి అనేక చిత్రాలను తెరకెక్కించారు. అలా రూపొందించిన ప్రతి సినిమాలోనూ సగటు మనిషి సమస్యలు, వాటికి తగ్గ పరిష్కారాలూ చూపిస్తూ సాగారు. ‘వెట్టిచాకిరి’పై పోరాటం సాగించాలి అని నినదిస్తూ తరువాత ఎన్ని సినిమాలు రూపొందినా, వాటికి ప్రేరణగా నిలచిన చిత్రం దాసరి రూపొందించిన ‘ఓ మనిషీ తిరిగిచూడు!’. 1977 జూన్ 18న ‘ఓ మనిషీ తిరిగిచూడు!’ చిత్రం జనం ముందు…