Minister Seethakka : అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు మంత్రి సీతక్క. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయండని ఆమె వ్యాఖ్యానించారు. మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండని, నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ఆమె సూచించారు. శాఖపరంగా వాస్తవాలనే నివేదించండని, మా మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దన్నారు. అధికారులు, అమాత్యులు వేరు వేరు కాదని, మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దన్నారు మంత్రి…