ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు దూకుడుగా వ్యవహరించారని, కొన్ని సందర్భాల్లో తమ విషయంలో పరిధి దాటి కూడా ప్రవర్తించారన్నది టీడీపీ నేతల అభిప్రాయం. కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి, జోగి, వల్లభనేని వంశీ ఇద్దరూ చంద్రబాబు, లోకేష్‌లపై మాటల దాడి చేస్తే... పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఎక్కువ…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జులు మారుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో నాయకులని సమన్వయ పరుస్తూ నడిపించిన థాక్రే ను ఫలితాలు రాగానే పంపించేశారు. అప్పటివరకు తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా ఉన్న దీపా దాస్ మున్షీ ఆ తర్వాత ఇన్చార్జిగా అదనపు బాధ్యతలతో నిన్నటి వరకు వ్యవహరించారు. అయితే.. దీపాదాస్‌కు అధిష్టానం మంచి అవకాశాన్ని ఇచ్చినా... పూర్తి స్థాయిలో పార్టీని, నాయకత్వాన్ని సమన్వయ పరచలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి.
మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తన్నులాట పీక్స్ చేరిందని అంటున్నారు. డజన్ మందికి పైగా నేతలు ఈ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా... చివరికి అధినేత చంద్రబాబు మాత్రం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషావైపు మొగ్గు చూపారు. దీంతో అసంతృప్తితో ఉన్న మిగతా నేతలు ఎన్నికల్లో షాజహాన్‌కు సహకరించలేదని చెప్పుకుంటారు. చివరికి కొన్ని చోట్ల ఏజెంట్లను కూడా పెట్టలేదట.
పొన్నాడ సతీష్ కుమార్... ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారాయన. ఎన్నికల సమయంలో కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పని చేశారు.
తెలంగాణ బీజేపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. జిల్లా అధ్యక్షుల నియామకం పార్టీలో అగ్గి రాజేసిందని చెప్పుకుంటున్నారు. కాషాయ పార్టీకి తెలంగాణలో సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 27 జిల్లాల అధ్యక్షుల నియామకానికి కేంద్ర పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ రిటర్నింగ్ అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి నామినేషన్స్ తీసుకొచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ...పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్‌గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ... భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో... మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి దాదాపుగా ఖరారైందా? కేబినెట్ ర్యాంక్‌తో ఆయన్ని గౌరవించాలని అనుకుంటున్నారా? కానీ… ఆయన మాత్రం ఆ కొత్త పోస్ట్‌తో అంత సంతృప్తిగా లేరా? అసలు పార్టీ ఏం ఆఫర్ చేసింది? ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? దాని మీద కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు చివరికి పీసీసీ పోస్ట్‌ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం నడుస్తూనే…
కామ్రేడ్స్… కాంగ్రెస్ మీద అలిగారా? అంతా మీ వల్లే… అంటూ నిందిస్తున్నారా? దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అగ్గికి ఆజ్యం పోసిందా? తెలంగాణ కామ్రేడ్స్ కూడా మేము సైతం అంటూ… ఓ పుడక వేసేస్తున్నారా? అసలిప్పుడు కమ్యూనిస్ట్‌లు ఏమనుకుంటున్నారు? జరుగుతున్న చర్చ ఏంటి? రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్, ఎన్నో ప్రాధాన్యతల నడుమ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకున్న ఇండియా కూటమి వ్యవహారం నానాటికీ తీసికట్టు అన్నట్టుగా మారుతోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మిత్ర…
గన్నవరం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ ఆఫీస్‌ని తగలబెట్టిన కేసులో సీన్ ఎందుకు రివర్స్ అయింది? అధికారంలో ఉండి కూడా ఫిర్యాదు దారుడిని కాపాడుకోలేకపోయారా? టీడీపీ పెద్దలు వల్లభనేని వంశీని లైట్ తీసుకుని బోల్తా పడ్డారా? గన్నవరం గరం గరంకు కారకులెవరు? ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజక వర్గాల్లో గన్నవరం ఫస్ట్ లిస్ట్‌లో ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ… 2019-…