వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.
తెలంగాణలో ఇప్పుడు టచ్ పాలిటిక్స్ జోరు పెరిగిపోయిందా? కొందరు నాయకులకు గులాబీ రంగు మీద మొహం మొత్తి కాషాయంపై మనసు పారేసుకుంటున్నారా? అట్నుంచి కూడా కొంచెం టచ్‌లో ఉంటే… చెబుతామన్న సమాధానం వస్తోందా? తెలంగాణలో బీజేపీ కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్న నాయకులెవరు? ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. శరవేగంగా మారుతున్న పరిణామాలు కూడా అదే…
తెలంగాణలోని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారా? తన కళ్ళెదుటే తన్నుకోబోయిన పార్టీ నేతల్ని ఆమె ఎలా సెట్ చేస్తారు? ఏం చెప్పి వాళ్ళని మారుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ తన్నులాటలు పార్టీ పుట్టి ముంచుతాయా? అలా జరక్కుండా తేల్చడానికి మంత్రి దగ్గరున్న మంత్ర దండం ఏంటి? అంత దారుణమైన పరిస్థితులున్న ఆ జిల్లా ఏది? సవాల్ ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇటీవలే…
తెలుగుదేశం పార్టీ కంచుకోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వరుసగా మూడు విడతల నుంచి టీడీపీ అభ్యర్ధులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. క్యాండిడేట్ ఎవరన్న దానితో సంబంధం లేదు. జస్ట్ గుంటూరు వెస్ట్ టీడీపీ టిక్కెట్ తెచ్చుకోగలిగితే చాలు.... ఎమ్మెల్యే అయిపోయినట్టే. దానికి చెక్ పెట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా... వర్కౌట్ కాలేదు. 2024లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిగా భావిస్తూ... మాజీ మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్ బరిలో దింపింది వైసీపీ.
ఒక పార్టీకి చెందిన నాయకుడు ఎంపీగా ఉండి..... ఆ పరిధిలో వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటే....ఆ లోక్‌సభ నియోజకవర్గం వ్యవహారాలు అంత సవ్యంగా జరగవన్నది సహజం. కానీ... అంతా ఒకే పార్టీ వాళ్ళయి ఉండి కూడా తేడాలు జరుగుతుంటే... దాన్నేమనాలి? అలాంటి ప్రశ్నలే వస్తున్నాయట ప్రస్తుతం అనంతపురం నియోజకవర్గం ప్రజలకు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు, తన పరిధిలోని అదే పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు.
ఆ ఎమ్మెల్యేది గిలిచిందాకా ఒక తీరు, కుర్చీలో కూర్చున్నాక మరో రీతి అన్నట్టుగా ఉందా? నాడు అష్టకష్టాలు పడి గెలిపించినవాళ్ళే నేడు దూరం అవుతున్నారా? ఎమ్మెల్యే ఆయనా? ఆయన కూతురా అన్నది తెలియకుండా పోయిందా? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా వ్యవహారం? ఎవరా శాసనసభ్యుడు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో నరసన్నపేట నియోజకవర్గం రూటే సపరేట్. ధర్మాన బ్రదర్స్‌కు కంచుకోట ఇది. అలాంటి కోటను గత ఎన్నికల్లో బద్దలు కొట్టారు బగ్గు రమణమూర్తి. టీడీపీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే…
తెలంగాణ సర్కార్‌లోని ఓ కీలకమైన విభాగంలో ఏం జరుగుతోందో సదరు మంత్రికి కూడా తెలియడం లేదా? ఆ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు మంత్రిని డోంట్ కేర్ అంటున్నారా? మేటర్ ముదిరి బంతి ముఖ్యమంత్రి కోర్ట్‌కు చేరిందా? స్వయంగా చీఫ్ సెక్రెటరీ పర్యవేక్షించాల్సిన ఆ విభాగం ఇతర అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందా? ఏ శాఖలో జరుగుతోందా తతంగం? ఎవరా మంత్రి? కాలుష్య నియంత్రణ మండలి. అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వ విభాగం. ఈ విభాగం సక్రమంగా ఉండి, బాధ్యతాయుతంగా పని చేస్తేనే……